టీకాతో టిబి వ్యాధికి చెక్‌ పెడదాం : డిపిఎంఒ

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వయోజన బిసిజి.టీకాల ద్వారా క్షయ(టిబి)వ్యాధికి చెక్‌ పెడదామని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌ పర్యవేక్షణ అధికారి (డిపిఎంఒ) డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌ అన్నారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని యుప ిహెచ్‌సి వాల్మీకివీధిó పరిధిలోని రెడ్డివారిపల్లి, ఈడిగపల్లిలలో నిర్వ హిస్తున్న వయోజన బిసిజి టీకా కేంద్రాన్ని డిఎన్‌ఎంఒ డాక్టర్‌ విష్ణు వర్ధన్‌రెడ్డితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌ లిస్ట్‌ ప్రకారం తనిఖీ చేశారు. అనంతరం హాజరైన ప్రజలకు అయన ఆధ్వర్యంలో వయోజన బిసిజి టీకాపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టిబి రాకుండా ముందస్తు నివా రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వయోజన బిసిజి టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16న ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు బిసిజి.టీకాలు ఇచ్చారని టిబి మరణాల తీవ్రతను నివారించడంలో బిసిజి టీకా చాలా సురక్షితమైందని, క్షయకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని మరింత పెంచడానికి, పెద్దలలో టిడి నుంచి రక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకారి అని, ఎవరు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా వేసుకోవచ్చునని పేర్కొన్నారు. 60 సంవత్సరాలుపై వద్దులకు, పొగ పీల్చేవారు, ,మధుమేహ వ్యాధిగ్రస్తులు, టిబి జబ్బుతో కోలుకున్న వారు, వారి కుటుంబ సభ్యులకు, వీరు టీకాకు అర్హులని, మీ రోజువారీ పనికి ఆటంకం,అసౌకర్యం ఉండదని చెప్పారు. ప్రభుత్వం అన్ని సాధారణ వైద్య సేవల్లో, ఆరోగ్య సంరక్షణకు చాలా మంచి కార్యక్రమమని తెలిపారు. కార్యక్రమంలో వాల్మీకి స్ట్రీట్‌ వైద్యులు ,ఆరోగ్య సిబ్బంది, ఆశాకార్యకర్త ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️