యువత లోని ప్రతిభను వెలికి తీసేందుకే “ఆడుదాం ఆంధ్ర”: ఎంపీటీసీ శేఖర్ రెడ్డి

Dec 26,2023 14:45 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య):బాల-బాలికలు, యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని ఊటుకూరు-2 ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఊటుకూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో “ఆడుదాం ఆంధ్ర” ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగ చంద్రశేఖర్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు, యువత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. యువతలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేయడం కోసం వారిని అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారని, అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడలకు పెద్దపీట వేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరు సర్పంచ్ ఈశ్వరయ్య, సచివాలయ సిబ్బంది వెంకటయ్య, మణికంఠ, రాణి, బేబీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

➡️