వైసిపి జెండా ఎగురవేద్దాం : వెంకటేష్‌

ప్రజాశక్తి-చీరాల చీరాల నియోజకవర్గంలో వైసిపి జెండాను ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని వైసిపి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ తెలిపారు. చీరాల పట్టణంలోని 18వ వార్డు, బోయినవారిపాలెం, పిట్టువారి పాలెం గ్రామాలలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్‌ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాలని లక్ష్యంతో అనేక పథకాల రూపొందించి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న పథకాలతో పాటు మరిన్ని పథకాలను నూతన మేనిఫెస్టోలో పొందుపరిచి అన్ని వర్గాల వారికి అండగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వాడరేవు చిన్నబరపలో 50 కుటుంబాల వారు వెంకటేష్‌ కు మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా వెంకటేష్‌ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మహేష్‌, బులియ్య, ప్రసాద్‌, కాశీరావు, ప్రసాద్‌, గోపి, అన్నవరం, రాంబాబు, చిన్న, మహేష్‌, సురేష్‌, శ్రీను, జగదీష్‌, నాగరాజు, రాజు, బుజ్జి, ప్రసాద్‌, రాజు, ఆనంద్‌, ప్రసాద్‌, గోపి, రామకృష్ణ, శ్రీను, కాశీరావు, రాజు, ఆనంద్‌, కోటి, ప్రసాద్‌, చోటు, బాల పాల్గొన్నారు. అదేవిధంగా చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చెమిటి బాలు, బొగ్గవరపు సుబ్బయ్య, మేడా ప్రసాదు, చుండూరి రామ్‌ సాయి, అమర సురేష్‌, అమరాశివ, పువ్వాడ హరికష్ణ, సుమన్‌, సుబ్రహ్మణ్యం, పువ్వాడ రామ్మూర్తి వారి బ్రదర్స్‌, బొగ్గవరపు రంగనాయకులు, అమర శ్రీనివాసరావు, పచ్చిపులుసు నరేంద్ర పాల్గొన్నారు.

➡️