ప్రజా సమస్యలపై పోరాడే వారినే గెలిపించాలి : లోత రామారావు

Apr 11,2024 15:14 #cpm

ప్రజాశక్తి- రంపచోడవరం :ప్రజా సమస్యలపై పోరాడే వారినే గెలిపించాలని సిపిఎం అభ్యర్థి లోతా రామారావు కోరారు. సిపిఐ, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు బలపరిచిన అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి  గురువారం మండలంలోని మారుమూల గిరిజన కొండరెడ్ల గ్రామాల్లో స్థానిక సిపిఎం నాయకులతో పర్యటించారు. జల మార్గం గుండా ఆయన కొల్లూరు కొండేపూడి తమ్మిలేరు కొటారు కొమ్ము గ్రామాలలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు పోలవరం నిర్వాసితులు అవుతున్న కుటుంబాల వారిలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆరండార్‌ ప్యాకేజీ ఇవ్వలేదని స్థానికులు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా లోతా రామారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన చట్టాలు 1/70 3జీవో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సిపిఎం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, మండల కార్యదర్శి చినబాబు, ఎంపీపీ కారం లక్ష్మి ,మాజీ సర్పంచ్‌ కుంజా నాగిరెడ్డి ,సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌, నాయకులు గుండెపూడి లక్ష్మణరావు , కమ్మచెచ్చు సత్తిబాబు, వడ్లది రమేష్‌ పాల్గొన్నారు.

➡️