కసింకోటలో మహిళా ఆసరా సదస్సు

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కసింకోటలో నాలుగో విడత మహిళ ఆసరా సదస్సు మంగళవారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్‌ మలసాల భరత్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ఏ పథకమైన బటన్‌ నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లోకి నగదును జమ చేసిన ఘనత జగన్మోహన్‌ రెడ్డి ది అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి ని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్‌ను చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విష్ణు మూర్తి , ఎంపీపీ కలగలక్ష్మి గున్నయ్య నాయుడు , జడ్పిటిసి దంతులూరి శ్రీధర్‌ రాజు, జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లి బాబు , మలసాల కిషోర్‌, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, మహిళలు పాల్గొన్నారు.

➡️