పల్స్‌పోలియో కార్యక్రమాన్నివిజయవంతం చేయండి

Mar 2,2024 15:25 #anathapuram, #pulsepolio
  • మేయర్ మహమ్మద్ వసీం, జడ్పీ చైర్మన్ గిరిజ

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : పల్స్‌ పోలియోపై అవగాహన కల్పించి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేలా చూడాలని నగర మేయర్ మహమ్మద్ వసీం, జడ్పీ చైర్ పర్సన్ గిరిజ లు సూచించారు.పల్స్‌ పోలియోపై శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో నగర మేయర్ మహమ్మద్ వసీం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ,డిప్యూటీ మేయర్లు వాసంతి, విజయ భాస్కర్ రెడ్డి ,కమీషనర్ మేఘ స్వరూప్ జెడ్పి సిఈఓ నిదియా దేవిలతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించడం ద్వారానే పోలియో వ్యాధిని నివారించవచ్చునన్నారు. అంగవైకల్యానికి ప్రధా న కారణం పోలియో చుక్కలు వేయించక పోవడమే అన్నారు.నగర వ్యాప్తంగా 122 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తారని,4,5వ తేదీలలో ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేస్తారన్నారు.అదే విధంగా ప్రయాణాలలో ఉన్న వారి కోసం బస్ స్టాండ్ ,రైల్వేస్టేషన్ లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎమ్ హెచ్ ఓ దేవి,యుగంధర్,సిడిపిఓ శ్రీదేవి,డాక్టర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️