తాటిపూడి జలాశయంలో వ్యక్తి మృతి

Jun 16,2024 21:03

 ప్రజాశక్తి- గంట్యాడ : మండలంలోని తాటిపూడి రిజర్వాయర్‌లో పడి ఆదివారం ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న విఆర్‌ఒ గంట్యాడ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీయించారు. మృతుడు చోడవరం గ్రామానికి చెందిన జలగొడుగుల నాగేశ్వరరావుగా గుర్తించారు. మృతుని భార్య వరలక్ష్మి కథనం ప్రకారం.. వేసవి సెలవులకు తాము ఎస్‌కోటలోని ఇంటికి వచ్చామని శుక్రవారం తన భర్త తాటిపూడి జలాశయం చూడడానికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో అంతా గాలించామని చెప్పారు. దీంతో ఎస్‌.కోట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. మృతి చెందిన వ్యక్తి తన భర్త అని వరలక్ష్మి గంట్యాడ పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేందర్‌ నాయుడు తెలిపారు.

➡️