ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మండల వైసిపి నేత స్టాలిన్‌

Apr 12,2024 14:11 #media meeting, #YCP Leaders

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడియం మండల వైసీపీ అధ్యక్షుడు, జేగురుపాడు గ్రామ సర్పంచ్‌ యాదల సతీష్‌ చంద్ర స్టాలిన్‌ అన్నారు. శుక్రవారం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ … గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు పెత్తందార్ల తో నడిపే రాజకీయాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చరమగీతం పాడారని, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరం రూరల్‌ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కఅష్ణ స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమం చేపట్టి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు కఅషి చేశారని అన్నారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ”చెత్త మంత్రి ” అని హేళనగా విమర్శించిన సంగతి అందరికి తెలిసిందేనని, గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ ఎం.ఎల్‌ .ఎ గా ఉన్నా ఏనాడు పారిశుద్ధ్య సమస్యలను పట్టించుకోకుండా అవహేళనగా మాట్లాడిన ఎమ్మెల్యే అదే స్వచ్ఛత కార్యక్రమం లో చీపురు పట్టడం ఎమ్మెల్యే ఎన్నికల స్టంట్‌ చేస్తున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారు ఎవరు కష్టం లో ఉన్నా బుచ్చయ్య చౌదరి ఆదుకున్న దాఖలాలు లేవని, అగ్రవర్ణాల వారి కష్టసుఖాల్లో మాత్రమే గోరంట్ల పాలుపంచుకుంటారని స్టాలిన్‌ అన్నారు ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉన్నపుడే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు.

➡️