పలువురు వైసీపీలో చేరిక

ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండ పాలెం మండలంలోని వాదంపల్లి ఉప సర్పంచ్‌ మిరంపల్లి అంజి, కాపు నాయకులు నీలం పెద్ద సుబ్బయ్య ఆదివారం వైసీపీ పార్టీలో చేరారు. అలాగే యర్రగొండ పాలెంనకు చెందిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యా కమిటీ మాజీ చైర్మన్‌ షేక్‌ మహబూబ్‌ బీ, షేక్‌ మొహమ్మద్‌ ఖాసీం, షేక్‌ ఖుద్దుస్‌, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ అబ్దుల్లా, షేక్‌ యాసిన్‌, షేక్‌ కరిముల్లా, షేక్‌ సమియుల్లా, షేక్‌ షెక్షా (గోల్డ్‌), షేక్‌ అబ్దుల్లా ,షేక్‌ నిసార్‌, షేక్‌ హన్ను తదితరులు వైసీపీలో చేరారు. వీరికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తాటిపర్తి చంద్రశేఖర్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది ఇతర పార్టీలను వీడి వైసీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిపి చేదూరి విజయభాస్కర్‌, జడ్పి కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌ బాషా, వైసీపీ మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, నాయకులు పబ్బిశెట్టి శ్రీను, కందూరి గురు తదితరులు పాల్గొన్నారు.

➡️