వాసుపల్లికి పలువురి మద్దతు

వాసుపల్లి గణేష్‌కుమార్‌

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌: విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు జైన్‌ సంఘం మద్దతు ప్రకటించింది. గురువారం ఆశీలుమెట్టలోని వాసుపల్లి కార్యాలయానికి వచ్చి ఈ మేరకు సంఘీభావం ప్రకటించారు. గాజువాకలో మేమంతా సిద్ధం సభకు వచ్చిన సిఎం జగన్‌ను నేరుగాకలిసి తమ మద్దతు ప్రకటించామని విశాఖపట్నం జైన్‌ సంఘం అధ్యక్షుడు మనోజ్ను తెలిపారు. విశాఖ దక్షిణంలో తమకు సుమారు 2200 ఓట్లున్నాయని, ఎమ్మెల్యేగా వాసుపల్లిని, ఎంపిగా బొత్స ఝాన్సీని గెలిపించుకుంటామన్నారు. మత్స్యకారుల సంఘీభావంవాసుపల్లికి మద్దతుగా వైసిపి సీనియర్‌ నేత గంపల గిరిధర్‌, తీర ప్రాంత వాడబలిజ సాంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూగి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో 29, 37 వార్డుల మత్స్యకార నేతలు, కార్యకర్తలు వైసిపిలో చేరారు. వీరికి గిరిధర్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాసారపు చిన్నారావు, నూకరాజు, ఎల్లాజీ, అప్పన్న, జగదీష్‌, ఎల్లయ్య, పొట్టి చిన్న, తెడ్డు శ్రీను, కొర్లయ్య, సతీష్‌, అమ్మోరు, రాము, తోటయ్య మొద్దు బంగారి, పిల్లా ఎల్లాజీ, కుర్మాన రాము, కదిరి బుజ్జి,వాడముల పోలరాజు, దెండేటి వెంకటరమణ, సూరాడ రాజశేఖర్‌, ఎల్లాజీ, వాసుపల్లి భాస్కర్‌, ఎల్లాజీ, వాడ వెంకటేష్‌, ఉమ్మిడి రాంప్రసాద్‌, కోలా ధనుంజయ ఉన్నారు.వైసిపిలోకి జనసేన యువత29వ వార్డు ఆకుల రవి ఆధ్వర్యంలో 37వ వార్డు యూత్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌, జనసేన టిడిపి నుండి యువత, మహిళలు వైసిపిలో చేరారు. వీరికి కండువాలు వేసి పార్టీలోకి వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కె.కిరణ్‌, వికాస్‌, రాజ్‌ కుమార్‌, డి.నిర్మల, డి. రాజు, ఆకుల విజయబాబు, బి.రాకేష్‌ఉన్నారు.

➡️