ఎఒబి చెక్‌ పోస్టును ఎస్‌పి ఆకస్మిక తనిఖీ

Feb 5,2024 21:10

పార్వతీపురంరూరల్‌ : మండలంలోని ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతమైన రావికోన, బట్టివలస దగ్గర ఇటీవల ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌తో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒడిశా నుంచి వస్తున్న వాహనాలను ఆపి నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాటుసారా, గంజాయి రవాణా అరికట్టే భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని చెక్‌పోస్ట్‌ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

➡️