ఎలక్ట్రోరల్‌ బాండ్ల -సుప్రీంకోర్టు తీర్పుపై నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Feb 17,2024 19:53

పార్వతీపురంరూరల్‌ :ప్రజాస్వామ్యానికి విఘాతం తెచ్చిన ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు, ఎన్నికల సంస్కరణలు, దొంగ డబ్బు పాత్ర అంశంపై వివిధ రాజకీయ పార్టీల వైఖరిపై ఈనెల 18న స్థానిక సుందరయ్య భవనంలో ఉదయం 10గంటలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా నాయకులు రెడ్డి వేణు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజాసంఘాలు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బంటు దాసు, శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకులు వి.ఇందిర పాల్గొన్నారు.

➡️