విద్యుత్‌ సంస్థలలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి యుఇఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుదర్శన్‌

రెడ్డిప్రజాశక్తి కడప అర్బన్‌ విద్యుత్‌ సంస్థలలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, అవినీతిని అరికట్టాలని యుఇఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుదర్శన్‌రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కడపజిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బి. నాగసుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా యుఇఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, యూ నియన్‌ హక్కులు కోల్పోయారని, పూర్తిగా రాజకీయ జోక్యంతో బదిలీలు ఇతర కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ సంస్థలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని కోరారు. కామనురు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సాను భూతిపరులని కొంతమంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే పద్ధతిని కొనసాగించేందుకు ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొ న్నారు. చిన్న ఉద్యోగుల పట్ల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సానుకూల దక్పథంతో పనిచేయాలని మనవి చేశారు. డిస్కౌం ప్రెసిడెంట్‌ ఎన్‌.శివ శంకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యుత్‌ సంస్థలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వాటన్నిటి పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అ గతంలో ఉన్న సర్వీస్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం కారుణ్య నియామకాలు, వారికి సంబంధించిన వేతనాలు చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు మేలు చేసేలా ఒకే వేతన విధానం అమలు చేయాలని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి మాట్లాడుతూ జిల్లా, రాష్ట్రంలో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులు, ఎనర్జీ అసిస్టెంట్లు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఎన్ని వినతి సమర్పించిన యాజమాన్యం సరైన రీతిలో స్పందించలేదని చెప్పారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల, ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో ఈ సమస్యలు అన్నిటి పైన విద్యుత్‌ యాజ మాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నాయిబ్‌ రసూల్‌, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు సురేం ద్రబాబు, జిల్లా కార్యదర్శి వెంకటరమణ, పుల్లయ్య, రాజంపేట డివిజన్‌ నాయకులు ఎరీకల రెడ్డి, సుబ్బారెడ్డి, పొద్దుటూరు డివిజన్‌ నాయకులు మహబూబ్‌ షరీఫ్‌, మైదుకూరు డివిజన్‌ నాయకులు నాగ మల్లయ్య, రామ్మోహన్‌, కడప డివిజన్‌ నాయకులు శివ ప్రసాద్‌ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, రాయచోటి డివిజన్‌ నాయకులు రెడ్డ ప్ప, అమర్నాథ్‌రెడ్డి, నాయుడు పాల్గొన్నారు.

➡️