క్రీడా కాంతులు వెదజల్లాలి

Dec 30,2023 21:11

పాచిపెంట : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర షెడ్యూల్‌ తెగల కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు అన్నారు. మండలంలోని పి.కోనవలస గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న అండర్‌ 17,19 బాలల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు – 2023 – 24 ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు క్రీడల్లో రాణించాలని తద్వారా శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు పట్టుదలతో శ్రమించి ఆయా క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ పి.రఘువర్మ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సాధారణమని, క్రీడా స్ఫూర్తి గొప్పదని అన్నారు. ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనూ, క్రీడల్లోను రాణించాలన్నారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి, రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో సీతంపేట ఆశ్రమ పాఠశాల బాలిక, బాలురు ఎక్కువ పోటీలుల్లో గెలుపొంది ఆల్‌రౌండ్‌ ఛాంపియన్లుగా నిలిచారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కె.శ్రీనివాసరావు, ఎంపిపి ప్రమీల, వైస్‌ ఎంపిపి ధనుంజరు, ప్రిన్సిపల్‌ మహేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు దండి ఏడుకొండలు, నాయకలు డోల బాబ్జీ, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️