గ్లోబల్‌ వార్మింగ్‌ అవగాహన ర్యాలీ

Dec 20,2023 20:51

కలెక్టరేట్‌ : ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభ వించి జన, ఆస్తి నష్టం జరుగుతుందని అవగాహన కలిగించడం కోసం బుధవారం పార్వతీపురంలో శ్రీజన్‌ స్కూలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన శ్రీజన్‌ స్కూల్‌ వద్ద ప్రారంభమై ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు కొనసాగింది. ఈ ప్రదర్శనను పార్వతీ పురం మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామ అప్పల నాయుడు ప్రారంభించి మాట్లాడారు. కాలు ష్యం పెరగడం వల్ల, ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువ అవడం వల్ల, అడవులను నరికి వేయడం వల్ల, వాహనాలు పెరగడం వల్ల, భూ ఉష్ణోగ్రతలలో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయన్నారు దీనివల్ల ఓజోన్‌ పొరకు రంధ్రం ఏర్పడు తోందని ఫలితంగా భూ ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని గుర్తు చేశారు. ప్రజలం దరూ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని, పర్యా వరణ రహిత పద్ధతులను పాటించాలని, మొక్కలను విరివిగా పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ యు. శ్రీను, ప్రిన్సిపాల్‌ డి. నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️