చేస్తామన్నవారితో పనులు చేయించండి

Dec 20,2023 20:49

సాలూరు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద మండలానికి మంజూరైన పనులను చేయడానికి ముందుకొచ్చిన వారితో చేయించాలని డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆదేశించారు. ఎంపిడిఒ జి.పార్వతి బుధవారం డిప్యూటీ సీఎం రాజన్నదొరని ఆయన నివాసంలో కలిశారు. ఉపాధి హామీ పథకం కింద కోటి 20లక్షలు, మరో మూడు కోట్ల రూపాయలతో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనులు చేయడానికి ఆసక్తి లేనివారిని పక్కనపెట్టి చేయడానికి ముందుకొచ్చిన వారితో చేయించాలని ఆదేశించారు. సకాలంలో నిధులు ఖర్చు కావాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు, కాలువలు నిర్మించాల్సి వుందని ఎంపిడిఒ పార్వతి చెప్పారు.కస్పా

➡️