తొమ్మిదో రోజుకు అంగన్‌వాడీల సమ్మె

Dec 20,2023 20:47

తెలంగాణా కంటే ఎక్కువ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీని అమలు చేయాలని అంగన్‌వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు బిక్షాటన చేపడుతున్న నిరసన తెలిపారు. బలిజిపేట : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపడుతున్న చట్టబద్ద సమ్మెకు ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా సమస్యలు పరిష్కారం చేయాలే తప్ప అందుకు విరుద్ధంగా చేపడుతున్న దుర్మార్గపు చర్యలను ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు తెలిపారు. స్థానికంగా అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ తెలంగాణా ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతాలు చెల్లిస్తానని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతాలు చేసి ఈరోజు అంగన్వాడీ తాళాలను పగలగొట్టే నీచమైన స్థాయికి జగన్‌ దిగజారి పోయారన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో తమ ప్రభుత్వ సత్తా చాటుకోవాలని, లేనిపక్షంలో ప్రజలు బుద్ధి చెప్పక మానరని ఆయన హెచ్చరించారు. ఈనెల 22 వరకు ఈ సమ్మె కొనసాగుతుందని, అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి ఇందిర, అంగన్వాడి మండల అధ్యక్షులు కె.దాలమ్మ, సావిత్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో బిక్షాటన తెలుపుతూ నిరసన తెలిపారు.పార్వతీపురంరూరల్‌ :అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ సమ్మెలో భాగంగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు. ప్రాజెక్టు సెక్టార్‌ నాయకులు టి.రాజేశ్వరి, బి.నేలవేణి, పార్వతి, ధర్మావతి, కె.రాజేశ్వరి, ఎస్‌.గౌరీమణి, ఎం.అలివేలు, ఎం.గౌరీ, బి.శాంతి, జ్యోతి, సునీత, జయలక్ష్మి, కల్పన ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు నాయకత్వంలో బిక్షాటన చేశారు. సమ్మెకు మద్దతుగా ఎఐసిటియు రాష్ట్ర నాయకులు డి.శ్రీనివాసరావు, పట్టణ నాయకులు దామోదర్‌, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ కన్వీనర్‌ ఎనుగుర్తి సంఘం, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సింహాచలం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు తలపెట్టిన సమ్మెలో భాగంగా బిక్షాటన చేశారు. ఈ సమ్మెకు టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శుల్లు కొల్లి తిరుపతిరావు, ఆర్‌.వేణుగోపాల నాయుడుతో పాటు పరుగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సత్యవతి, సునీత, లక్ష్మి, శైలజ, యశోద, శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.రామలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీల సమ్మెలో గుమ్మలక్ష్మీపురంలో అంగన్వాడీలు బిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేటలో ప్రతి షాపు, ఇంటింటికి వెళ్లి బిక్షాటన చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి, మండల అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి ఎం.రమణ పాల్గొన్నారు. సాలూరు: ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు బిక్షాటన చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు బి.రాధ, ఎ.నారాయణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు స్టేట్‌ బ్యాంక్‌ జంక్షన్‌ నుంచి బోసు బొమ్మ జంక్షన్‌ వరకు బిక్షాటన చేపట్టారు. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల వరలక్ష్మి పార్వతీ తిరుపతమ్మ పాల్గొన్నారు.కాంగ్రెస్‌ మద్దతు: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మెకు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సిగడాపు బంగారయ్య, సీనియర్‌ నాయకులు ద్వారపురెడ్డి పుండరీకాక్ష నాయుడు మద్దతు పలికారు. నిరసన శిబిరాన్ని సందర్శించి వారు మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలన్నారు. కొమరాడ : మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. యూనియన్‌ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, సెక్టార్‌ లీడర్‌ బి.అలివేలు, జ్యోతి, పద్మ, మల్లేశ్వరమ్మ మాట్లాడుతూ అన్ని బడ్డీలు వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తూ మండల పరిషత్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావుకు వినతిని అందజేశారు. కార్యక్రమంలో భారీగా అంగన్‌వాడీలు పాల్గొన్నారు.గరుగుబిల్లి: సమస్యలు పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం బిక్షాటన చేపట్టారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ నాయకులు గౌరమ్మ, మర్రాపు సావిత్రి మాట్లాడుతూ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేదేలేదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీలు, హెల్పర్‌ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కురుపాం : కురుపాం, జియ్యమ్మవలస మండలాల చెందిన అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొని కురుపాంలో పలు వీధుల్లో షాపుల్లోకి వెళ్తూ బిక్షాటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి, ప్రాజెక్టు కార్యదర్శి జె.సరోజ, సెక్టార్‌ లీడర్లు అంగన్వాడీలో వర్కర్లు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట అంగన్వాడీలు బిక్షాటన నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎం.తిరుపతిరావు హాజరై మాట్లాడారు కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.కాంతారావు, ప్రాజెక్టు కమిటీ సభ్యులు దర్శిమి, పార్వతి, నాయకులు సురేష్‌, కాంతారావు పాల్గొన్నారు. పాచిపెంట : అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రభావతి, ప్రాజెక్ట్‌ నాయకులు పార్వతి, రమణమ్మ, బంగారమ్మ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మక్కువ : అంగన్వాడీ సిబ్బందికి ముఖ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మన్మధరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ వేశారు. అంగన్‌వాడీల సమ్మెకు ఆయన సంఘీభావంగా తెలిపారు. తొలుత ప్రధాన రహదారి ర్యాలీగా వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు బిక్షాటన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, గిరిజన సంఘం నాయకులు టి.ప్రభాకరరావు, నాయకులు సుశీల, పాల్గొన్నారు.

➡️