రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిరసన

Dec 12,2023 22:17

వీరఘట్టం : మండల కేంద్రమైన మర్రివీధికి సుమారు 40 మంది లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని టిడిపి నాయకులు బల్ల హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. తొమ్మిదో వార్డు పరిధిలోని గత రెండు నెలల నుంచి 40 మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే రేషన్‌ బియ్యం పంపిణీ చేసేందుకు చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా రెండు రోజుల్లో రేషన్‌ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని హరిబాబు తెలిపారు.

➡️