గుంజీలు తీస్తూ నిరసన

Jan 6,2024 16:36 #Manyam District
anganwadi workers strike 26th day protes manyam

ప్రజాశక్తి-పాలకొండ : 26 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాలకొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో డివిజనల్ కేంద్రంలో పాలకొండ తాహసిల్దార్ కార్యాలయం ఓట్లేయడం తప్పు చేసాము అని గుంజీలు తీస్తూ నిరసన తెలియజేశారు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.హిమప్రభ జిల్లా కోశాధికారి బి అమరవేణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని కనీస వేతనములు అమలు చేయాలని, వేతనాలు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కేేంద్రంలో ఈరోజు 24 గంటలు దీక్షలు ప్రారంభం అయిందని, జిల్లా కేంద్రాల్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ అత్యవసర సర్వీసుల కింద ఐసిడిఎస్ తీసుకొచ్చి ఎస్మా ఉపయోగిస్తున్నట్లు జీవో విడుదల చేయడానికి తీవ్రంగా ఖండించారు. అంగనవాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా ఇటువంటి చర్యలు పూనుకోవడం దుర్మార్గమైనచర్యని అన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకొని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సంఘం జేఏసీ నాయకులు బత్తిని మోహన్ రావు అంగన్వాడీ శిబిరం దగ్గరకు వచ్చి మద్దతు తెలిపారు. ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు జి.జెస్సీబాయి, ప్రతినిధులు జి.శారద, ఆర్.భవాని, ఎం.శ్యామల, శ్రీదేవి సుగుణ ,లలిత, దివ్య నిర్మల, గంగమ్మ, కుమారి తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.

➡️