గురుకులాల్లో ఇంటర్లో ప్రవేశానికి కౌన్సిలింగ్‌

May 22,2024 21:21

సీతంపేట : స్థానిక ఐటిడిఎ పరిధిలో గల గిరిజన బాలుర గురుకుల కళాశాలలో కౌన్సిలింగ్‌ ప్రక్రియను గురుకులాల కన్వీనర్‌, ప్రిన్సిపల్‌ పి,రామారావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సీతంపేట బాలుర, బాలికల గురుకుల కళాశాల మొదటి సంవత్సరం ప్రవేశానికి 310 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు అలాగే పెద్దమడి బాలుర గురుకుల కళాశాల ప్రవేశానికి 56 సీట్లకు అవకాశం కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరిట్‌ ప్రాథమికన అత్యధిక మార్కులు ఉన్నవారికి సీట్లు ప్రవేశాలు అవకాశాలు కల్పించినట్లు రామారావు తెలిపారు. ఈ కౌన్సిలింగ్లో ప్రిన్సిపాళ్లు సత్యనారాయణ, సూర్యకుమారి, సూపరిటెండెంట్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

➡️