“తెలుగు కవులకు వందనాలు “కవితావిష్కరణ

Dec 16,2023 12:26 #Manyam District
poetry release

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : డా.కత్తిమండ ప్రతాప్ నేత్రుత్వంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో కన్వీనర్ కొల్లి రామావతి సారద్యంలో 16,17 రెండు రోజుల పాటూ నిర్వహించిన తలపెట్టిన కవి సమ్మేళనం జరుగుతున్న సందర్భంగా బుద్దాల కన్వెన్షన్ హాల్ లో వేదికపై సాహితీ చైతన్య కిరణాలు, బాల కదా నిలయం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు డా. భోగెల. ఉమామహేశ్వరరావు, పాలక దేవానంద్ ఆధ్వర్యంలో తెలుగు కవులకు వందనాలు కవిత పోస్టర్ ను శ్రీశ్రీ కళావేదిక సాహితీ సంస్థ అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తి మండ ప్రతాప్ చేతుల మీదుగా శనివారం ఉదయం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా కత్తి మండ మాట్లాడుతూ తెలుగు భాష కోసం సాహితి చైతన్య కిరణాలు సంస్థవారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. కవులకు ఆదరణ ఉంటే తెలుగు భాష సజీవంగా ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా లోనూ విరివిగా సాహిత్య సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం మూలానా ఎందరో కళాకారులను ఆ సంస్థ ప్రోత్సాహిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రేశ్రీ కళా వేదిక మన్యం జిల్లా కార్యదర్శి పెద్దింటి నిర్మల్ కుమార్, పెద్దింటి దిలీప్ కుమార్ పాల్గొన్నారు.

➡️