గిరిజన గ్రామాల్లో దోమల మందు పిచికారీ

May 20,2024 21:50

సీతంపేట: మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన చెక్కాపురం, గెద్దకోల, గుజ్జీ తదితర గ్రామాల్లో సోమవారం సబ్‌ యూనిట్‌ అధికారి జె.మోహన్‌రావు ఆధ్వర్యంలో మలాథియన్‌ పిచికారీ చేశారు. ఇళ్లలోనూ, బయట స్ప్రేయింగ్‌ చేస్తున్నామని తెలిపారు. మలేరియా ఎపిడిమిక్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని స్ప్రేయింగ్‌ చేస్తున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం అన్ని గ్రామాల్లో ముందస్తుగా గ్రామస్తులకు తెలియజేసే పిచికారీ చేస్తున్నమన్నారు. వర్షాకాలంలో దోమల నివారణకు ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి, ఎంపిహెచ్‌, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️