సిపిఐ(ఎంఎల్)ఆఫీస్ లో మహిళా దినోత్సవం

ప్రజాశక్తి-వీరఘట్టం : పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం  స్థానిక సిపిఐ(ఎంఎల్) పార్టీ ఆఫీస్ లో ఈ రోజు అంతర్జాతీయ 8వ మహిళా దినోత్సవం జరిగింది. మహిళాలు పట్ల ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం బిజెపి అలాగే వైసిపి ఈ ప్రభుత్వంలో మహిళా పై అత్యాచారాలు, అర్ధనాగ్న ప్రదర్శనలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ జరుగుతున్నాయని అఖిల భారత ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నర్సీపురం దుర్గా చంద్ర చూడమని విమర్శించారు. అలాగే గెడ్డగమ్మ గౌరీశ్వరి జిల్లా నాయకురాలు సమాన హక్కు లు సమాన అవకాశాల కోసం పోరాడాలి అని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళా పై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని మహిళా రిజర్వేషన్ చట్టం 2024 ఎన్నికలు నుండి అమలు చెయ్యాలని విమర్శించారు. అలాగే దుగ్గివలస సూర్యకళ మాట్లాడుతున్నారు.అధిక ధరలు తగ్గించాలి గాజాలో మహిళలపై అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అసభ్యకారం అరికట్టాలి. అలాగే మధ్యపానం నిషేదించాలి.గ్యాస్ సిలిండర్ 450 కే ఇవ్వాలని ప్రతి పంచాయితిలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్దిల్లాలని చెప్పి పెద్దఎత్తున నినాదాలు చేస్తు అధిక సంఖ్యలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొ న్నారు.

➡️