వ్యాధులు ప్రబలకుండా చర్యలు : డిఎంహెచ్‌ఒ

May 23,2024 21:37

 ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ కె.విజయపార్వతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. పిహెచ్‌సికి వస్తున్న రోగులు, అందుతున్న సేవలపై ఆరాతీశారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పిహెచ్‌సిలో పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ వినోద్‌, శ్రీధర్‌, హర్ష, డిఇఎంఒ రెడ్డి, తాడికొండ వైద్యాధికారి బుద్దేశ్వరరావు, అభిలాష్‌, డిఎం సిహెచ్‌ఒ పద్మ ఉన్నారు.

➡️