ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Nov 25,2023 16:11 #Annamayya district
medical camp in boyinapalli

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయినపల్లి లో గల అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ డి.స్వర్ణలత మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీపతి డయాగ్నోస్టిక్ కేంద్రం వారి సహకారంతో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో రక్త పోటు, మధుమేహంతో పాటు శరీర ద్రవ్యరాశి సూచిక, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలు ఉచితంగా చేశారు. వైద్య శిబిరం నిర్వహించిన శ్రీపతి డయాగ్నోస్టిక్ కేంద్రం వారికి, ప్రిన్సిపల్ మరియు కళాశాల సిబ్బందికి కళాశాల అధినేత చొప్పా గంగిరెడ్డి, కోశాధికారి అభిషేక్ రెడ్డి, చైర్మన్ రామచంద్రయ్యలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వై.ప్రదీప్ కుమార్, ఆర్.ప్రదీప్ కుమార్, సుధాకర్, డాక్టర్ గిర్రా శేఖర్, డాక్టర్ ఎం.శిరీష, అధ్యాపక మరియు ఎన్ ఎస్ ఎస్ బృందం పాల్గొన్నారు.

➡️