కువైట్‌ అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) : కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి సత్యనారాయణ అన్నవరప్పాడు గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరరావుల మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులను కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు బిజెపి జిల్లా ప్రెసిడెంట్‌ బొమ్మల దత్తత్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ.. కుటుంబ పోషణ కోసం సుధీర ప్రాంతాలకు వెళ్లి అనుకోని ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందిన ఈశ్వరరావు సత్యనారాయణ ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ బాధ తీర్చలేనిదన్నారు. పోయిన ప్రాణం తీసుకునే రాలేమని ప్రభుత్వం వైపు నుండి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఎవరైతే ఈ ప్రమాదంలో మరణించారో వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఐదు లక్షలు రూపాయల చెక్కు బూరుపల్లి శేషారావు సబ్‌ కలెక్టర్‌ చేతుల మీదగా కుటుంబ సభ్యులకి అందజేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే రెండు లక్షల రూపాయలు అందే విధంగా తగు చర్య తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ ఆర్‌ కృష్ణ నాయక్‌, బూరుగుపల్లి శ్రీనివాస్‌, సింహాద్రి, వీర వెంకట సత్యనారాయణ, బొడ్డు రామాంజనేయులు, అతికాల శ్రీను, పిప్పర రవి, తహశీల్దార్‌ సుధా, సిఎస్‌డిడి సుధీర్‌ రెడ్డి, రెవిన్యూ అధికారి పావని, రెవిన్యూ సిబ్బంది వై వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️