దోర్నాల మండలంలో స్వల్ప ఉద్రిక్తతలు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలో సోమవారం చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలోని ఐనముక్కల గ్రామంలోని 201వ పోలింగ్‌ బూత్‌, చిలకచర్ల, చిన్నారుట్ల గ్రామాల్లో కొద్దిసేపు వైసీపీ, టిడిపి నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సకాలంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులను మోసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా వారి సహాయకారులు కృషి చేశారు. పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు క్యూలైన్‌లలో ఉండడంతో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్‌ జరిగింది.

➡️