భారీ మెజార్టీలతో మరింత బాధ్యత పెరిగింది : ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట: ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అ ద్భు త విజయం, భారీ ఆధిక్యాలు తమపై బాధ్యత మరింత పెంచాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం స్థానిక పండరీ పురంలోని తన నివాసంలో తాడికొండ, దెందులూరు ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, చింతమనేని ప్రభాకర్‌ లు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రావణ్‌కుమార్‌, ప్రభాకర్‌ పుల్లారావుతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటిని వారిద్దరు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. శ్రావణ్‌కుమార్‌, ప్రభాకర్‌ను శాలు వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ అర్హులై న ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు,స్థానిక సమస్యల పరిష్కారం విషయంలో సత్వర స్పందనే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మె ల్యేలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని అన్నారు. ఈ సందర్భంగానే చిలక లూరిపేట నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు పుల్లారావుకు శుభాకాంక్షలు తెలిపారు.

➡️