గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-శింగరాయకొండ : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత హనుమాన్‌ విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బింగినపల్లిలో గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన అభివద్ధి గురించి వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నాయకులు చీమకుర్తి కృష్ణ, కూనపురెడ్డి సుబ్బారావు, పులి వీరప్రసాదు, పులి మాలకొండయ్య, సన్నెబోయిన మాలకొండయ్య, రోశిరెడ్డి, మించాల బ్రాహ్మయ్య, బిజెపి నియోజకవర్గ సమన్వయకర్త బాలకోటయ్య, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️