గొల్లపల్లి రిజర్వాయర్‌ లో ఎన్‌ డి ఆర్‌ ఎఫ్‌ బృందాలతో మాక్‌ డ్రిల్‌

ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం) : పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ లో మంగళవారం ఎన్‌ డి ఆర్‌ ఎఫ్‌ బృందాలతో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి వరదలు, విపత్తుల నివారణ కోసం కేంద్ర బృందాలతో మాక్‌ డ్రిల్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ పాల్గొని మాట్లాడుతూ … ప్రకృతి విపత్తులలో ప్రజలకు తక్షణ సాయం కోసం ఎన్‌ డి ఆర్‌ ఫ్‌ బృందాలు ఎప్పుడూ ముందుగా ఉంటాయని అన్నారు. గతంలో ఎన్‌ డి ఆర్‌ ఫ్‌ బృందాలు చూపించిన ధైర్య సాహసాలు వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌, రెవెన్యూ, ఫైర్‌, మెడికల్‌ శాఖల అధికారులు, ఎన్‌ సి సి విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️