దోమల నివారణ మందు పిచికారీ

దోమల నివారణ మందు పిచిరారీని పరిశీలిస్తున్న జిల్లా అధికారి ప్రసాదరావు

 

 

ప్రజాశక్తి-దేవరాపల్లి

పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పినకోట గ్రామంలో గురువారం మలేరియా దోమల నివారణ మందును వైద్య సిబ్బంది ప్రతి ఇంటిలోనూ పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా మలేరియా అధికారి బివిఎస్‌ ప్రసాదరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌లో మలేరియా దోమలు ప్రభల కుండా జాగ్రత్తలు వహించాలన్నారు. దీనికి ముందు ల్యాబ్‌లో రికార్డులు తనిఖీ చేశారు. మలేరియా పాజిటివ్‌ కేసులు వచ్చిన చోట రక్తపూతలు సేకరించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. దోమ పుట్ట కూడదు, దోమ కుట్ట కూడదు నినాదంతో 2027 నాటికి మలేరియా రహిత రాష్ట్రంగా చేయడానికి సిబ్బంది కృషి చేయాలని కోరారు. గుర్తించిన గ్రామాల్లో వేగవంతంగా స్ప్రేయింగ్‌ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి జి.వెంకటేష్‌, అసిస్టెంట్‌ మలేరియా అధికారి ఏజె.సత్యనారాయణ, ఎన్‌విబి డిసిపి అధికారి శ్రీనివాసరావు, సబ్‌ యూనిట్‌ అధికారి బాబూరావు, ఎంపీహెచ్‌ఓ గంగరాజు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రవిశర్మ. పర్యవేక్షకురాలు సావిత్రి, ఆప్తాలమిక్‌ అధికారి రమణబాబు, శ్రీదేవి, అశ్వని, సిబ్బంది పాల్గొన్నారు.

➡️