నూతన కమిషనర్‌ను కలిసిన మున్సిపల్‌ కార్మికులు

Jan 17,2024 15:34 #anathapuram, #muncipal workers

ప్రజాశక్తి-అనంతపురంకార్పొరేషన్‌ : అనంతపురం కార్పొరేషన్‌కు నూతన కమిషనర్‌గా బాధత్యలు స్వీకరించిన మేఘ స్వరూప్‌ ను బుధవారం ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు కలిసి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ.. కార్మికులకు అండగా ఉండి వారికి రావలసిన ప్రయోజనాలు బకాయిలు సకాలంలో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌ ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. సిఐటియు నాయకత్వంతో జాయిన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి సమస్యలు చర్చించాలని కోరారు. దీనిపై కమిషనర్‌ సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల కోసమే పని చేస్తామని తెలియజేశారు. వారికి కావాల్సినవి రావాల్సినవి త్వరగా వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని హామీ ఇచ్చారు. సిఐటియు నాయకత్వంతో పది రోజుల తర్వాత జాయిన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, మున్సిపల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం సిఐటియు పట్టణ కమిటీ కార్యదర్శి వెంకటనారాయణ, సిఐటియు ఉపాధ్యక్షులు ప్రకాష్‌ రెడ్డి, నగర అధ్యక్ష కార్యదర్శులు స్వామి, తిరుమలేశు, మహిళా కన్వీనర్లు లక్ష్మీనరసమ్మ మంత్రి వరలక్ష్మి, నల్లప్ప, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ అధ్యక్ష కార్యదర్శులు రాయుడు, ఓబుల్‌ పతి, మురళి, పోతలయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఆదినారాయణ, కమిటీ సభ్యులు గురు ముత్తు తదితరులు పాల్గొన్నారు.

➡️