అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం : మాజీ ఎమ్మెల్యే

Jan 7,2024 16:35
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం : మాజీ ఎమ్మెల్యే
ప్రజాశక్తి – ఆత్మకూర్
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ఉన్నదని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టడం ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నాడు భవిష్యత్తుకు గ్యారంటీ పథకం తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తుందన్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు ఆత్మకూరు పట్టణంలోని ఎరుకలపేట వీధిలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ చంద్రబాబు పాలన వల్లే సాధ్యమవుతుందని ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీ ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జెట్టి వేణుగోపాల్ అబ్దుల్లాపురం భాష .కలిముల. సుబ్బరాజు తదితరులు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది.
➡️