ఆశాల సమస్యల పరిష్కారానికై 8న చలో విజయవాడ

Jan 31,2024 17:21

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు వి.యేసురత్నం

ఆశాల సమస్యల పరిష్కారానికై 8న చలో విజయవాడ
ప్రజాశక్తి – ఆత్మకూర్
ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నారని, ఇచ్చే అతి తక్కువ వేతనాలతో పెరిగిన ధరలకు అనుగుణంగా కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు అధ్యక్షులు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు భారతి, శారద, లక్ష్మి లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చెల్లించే రూ.10 వేల వేతనంలో నెలకు రూ.3వేలు విధి నిర్వహణ సమయంలో ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. టీఏ, డిఏ చెల్లించడం లేదు. ఆశాలకు పని భారం ఎక్కువైందని, సమయం, సెలవులు లేవు ఆశా కార్యకర్తలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. చనిపోయిన ఆశాలకు ఎక్స్ గ్రేసీయా చెల్లించడం లేదు. పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆశాలకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు. దీని వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ఆశాలు గర్భవతులుగా ఉన్నవారికి ప్రసవ సమయంలో విధి నిర్వహణ చేయాల్సి వస్తుంది. మెటర్నరీ లీవులు ప్రభుత్వం ఆశాలకు వర్తింప చేయడం లేదన్నారు. ప్రభుత్వం నాసిరకం సెల్ ఫోన్లు సరఫరా చేయడం ద్వారా పనిచేసిన లెక్కింపులోకి రావడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని పద్ధతిలో మన రాష్ట్రంలో రిటైర్మెంట్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా సేవలు అందించిన ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ప్రతినెల గౌరవ వేతనం మొత్తం ఒకటేసారి ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. ఈనెల 8వ తేదిన నిర్వహించె చలో విజయవాడకు ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️