కనపకుంటలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయాలి

Dec 16,2023 19:22

కేంద్ర మంత్రికి వినతి పత్రం అందిస్తున్న ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ మాజీ కమిటీ సభ్యులు సట్టి.రాజశేఖర్‌

కనపకుంటలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయాలి

ప్రజాశక్తి-డోన్‌

డోన్‌ మండల పరిధిలోని కనపకుంట గ్రామంలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయాలని ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ మాజీ కమిటీ సభ్యులు సట్టి.రాజశేఖర్‌ శనివారం కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి దేవ్‌సింగ్‌ చౌహాన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ మాజీ కమిటీ సభ్యులు సట్టి.రాజశేఖర్‌ మాట్లాడుతూ కనపకుంట చుట్టూ పక్కల మూడు గ్రామాలకు పదివేల జనాభా ఉందని ఇంతవరకు ఒక్క సెల్‌ టవర్‌ లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. స్పందించిన కేంద్ర మంత్రి సెల్‌ టవర్‌ ఏర్పాటుకు అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

➡️