నిరుద్యోగ యువతకుజనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలు ఎంతో అవసరం : డిఎస్‌పి

Dec 17,2023 21:51

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డిఎస్‌పి శ్రీనివాస్‌ రావు, స్నేహ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఆశ తదితరులు

నిరుద్యోగ యువతకుజనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలు ఎంతో అవసరం : డిఎస్‌పి
ప్రజాశక్తి – ఆత్మకూర్‌
పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు జనరల్‌ స్టడీస్‌ జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని స్నేహ స్టడీ సర్కిల్‌లో ఎస్‌జిటి వెంకటేశ్వర్లు తయారు చేసిన డిఎస్‌సి గ్రూప్‌ పరీక్షల పుస్తకాన్ని డిఎస్‌పి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి శ్రీనివాసరావు ఆత్మకూరు పట్టణంతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువత ఎస్‌జిటి వెంకటేశ్వర్లు తయారు చేసిన డిఎస్‌సి గ్రూప్‌ పరీక్ష పుస్తకాన్ని చదివి, ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. మారుమూల ప్రాంతమైన ఆత్మకూరు పట్టణంలో ఇలాంటి పుస్తకాలను తయారు చేసి నిరుద్యోగులకు అందించడం అభినందనీయమన్నారు. నిరుద్యోగ యువత ఇలాంటి పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని, పోటీ పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. స్నేహ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ పి.ఆశ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ఆత్మకూరు పట్టణంలో తమ స్నేహ స్టడీ సర్కిల్‌లో అనేకమంది యువత శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. వెంకటేశ్వర్లు తయారు చేసిన డీఎస్సీ గ్రూప్‌ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్‌ను నిరుద్యోగులకు అందించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకునేందుకు అవకాశం లేని పేద నిరుద్యోగ యువతకు అందుబాటులోనే ఉండే విధంగా స్నేహ స్టడీ సర్కిల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్సై కృష్ణమూర్తి, ప్రముఖ న్యాయవాది అడిగె శ్రీధర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️