ప్రభుత్వం చేతకానితనంతోనేఅంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం

Jan 6,2024 19:06

సిపిఎంసమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రభుత్వం చేతకానితనంతోనేఅంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం

ప్రజాశక్తి – ఆత్మకూరు

సమ్మెను పరిష్కరించడం చేతకాకుండా వారిపైన ఎస్మా చట్టాన్ని ప్రయో గించి ప్రభుత్వము తమ చేతకానితనాన్ని నిరూపించుకుందని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌, పట్టణ నాయకులు ఏ. సురేంద్ర, డి. రామ్‌ నాయక్‌, షైక్‌ ఇస్మాయిల్‌లు అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా వేతనాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి మడమతిప్పి సమ్మె పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని అన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు జీతాలు కూడా తగ్గించి అంగన్వాడీల పైన కక్ష పూరితమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో అంగన్వాడీ కార్మికులు ,వారికి మద్దతు ఇస్తున్న అన్ని రకాల ప్రజా సంఘాలు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తక్షణమే ప్రభుత్వం ఎస్మాని ఎత్తివేసి అంగన్‌ వాడీలతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని ,లేనట్లయితే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టవలసి వస్తుందని వారు తెలియజేశారు.అంగన్వాడీలపై ప్రభుత్వం నిరంకుశం – ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం నిరంకుశమైన చర్య అని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌ ఓ ప్రకటనలో ఖండించారు. కార్మికుల సమస్యలపై చివరి అస్త్రంగా సమ్మె చేయటం కార్మికుల హక్కని అలాంటి హక్కును ఉక్కు పాదంతో అణిచివే యా లనే ప్రభుత్వ చర్యను ప్రజాసంఘాలు మేధావులు ఖండించాలని అన్నారు. జీవో నెంబర్‌2ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️