వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

Feb 13,2024 19:59

కొట్టాల చెరువులో వసతి గృహ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న డీఈవో సుధాకర్‌ రెడ్డి

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా విద్యాశాఖ అధికారి కె.సుధాకర్‌ రెడ్డి
ప్రజాశక్తి – ఆత్మకూరు
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.సుధాకర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలను, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న విద్యాబోధన, విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై డిఇఒ ఆరా తీశారు. అనంతరం ఆయన కొట్టాల చెరువు గ్రామంలో ఏర్పాటు చేయనున్న వసతి గృహానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదివాసి మహా అభియాన్‌ పథకం కింద 50 మంది విద్యార్థులకు వసతి గృహం నిర్మిస్తున్నట్లు తెలిపారు. వసతి గృహం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల 30 లక్షలు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జానకి రాముడు, సురేష్‌, రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️