ప్రత్యేక హోదాపై పోరాటమేదీ?

ప్రజాశక్తి-వేంపల్లె/లింగాల/సింహాద్రిపురం/పులివెందుల టౌన్‌/రూరల్‌సిఎం జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌. షర్మిల పేర్కొన్నారు. ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారాని ఆశీస్తున్నానని తెలిపారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌ జిల్లా పులి వెందుల నియోజవకర్గంలోని వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, పులివెందుల మండలాల్లో ఐదో రోజు ఆమె బస్సుయాత్రను పున:ప్రారంభించారు. షర్మిల పర్యటనను లింగాలలో అడ్డుకునేందుకు వైసిపి శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. షర్మిల, సునీత డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అల్లరి మూకలను పోలీ సులు చెదగొట్టారు. బస్సుయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అన్యా యాన్ని ఎదురి స్తారాని నమ్మకం నాలో ఉందని చెప్పారు. నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను చూస్తూ చూస్తూ అన్యాయాన్ని సహించ లేక పోయానని చెప్పారు. నాలుగు రోజులుగా జిల్లాలో పర్యటిస్తుంటే అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టు కుందని, అందుకే మా పర్యటనను అడ్డుకుం టున్నార న్నారు. కాంగ్రెస్‌ జెండాలను పీకుతున్నారన్నారు. మీరు ఎంతైనా అరు చుకోండి మాకేం అభ్యంతరం లేదని తెలిపారు. అల్లరి చేసే వాళ్లు పులివెం దులకు రండి పూల అంగళ్ల వద్ద పంచాయతీ పెడదామన్నారు. వివేకాను ప్రత్యేక హౌదా కోసం పోరాటం చేస్తానని చెప్పి మోసం చేశారుఎవరు హత్య చేశారో తేల్చుకుందామని తెలిపారు. న్యాయం ఒకవైపు.. అధర్మం మరొక వైపు ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లు చెప్పారు. ధర్మ పోరాటం ఒకవైపు…డబ్బు, అధికారం మరొక వైపు ఎన్నికల్లో ఉన్నట్లు చెప్పారు. న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా లేక వివేకాను చంపిన హంతకుడు అవినాష్‌రెడ్డిని గెలిపిస్తరా అని ప్రజలకు ప్రశ్నించారు. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రతి ఓటరు హంత కులను ఓడించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్ళే భయపడతారని తప్పు చేయకుంటే భయం ఎందు కని ప్రశ్నించారు. ధర్మం వైపు షర్మిల నిలబడిందని కాబట్టి ప్రజ లందరూ ధర్మం వైపు నిలబడే ఆమెను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, విద్యార్థి విభాగం నాయ కుడు ధృవకుమార్‌రెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షులు నజీర్‌ అహ మ్మద్‌, ప్రొద్దుటూరు కౌన్సిలర్‌ ఇర్ఫాన్‌ బాష, శ్రీనివాసులు రెడ్డి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్‌ రహంతుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాపీర్‌, కమలాపురం సిపిఐ అభ్యర్థి గాలి చంద్ర, వేమా నాగరాజా, బాలం సుబ్బరాయుడు, రామకృష్ణ, సుబ్రమణ్యం పాల్గొన్నారు.

➡️