రక్తదానంపై అవగాహన అవసరం

Dec 4,2023 22:58

ప్రజాశక్తి-వన్‌టౌన్‌

రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు అన్నారు. ఆ కళాశాల జువాలజీ, జాతీయ సేవా పథకం, రెడ్‌రిబ్బన్‌ క్లబ్‌ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలోని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు బ్లడ్‌ గ్రూపింగ్‌ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్‌ నారాయణరావు మాట్లాడుతూ రక్తదానం తోటి మానవుల ప్రాణాలను నిలబెడుతుందన్నారు. ఇప్పటికీ సకాలంలో రక్తం అందక వేలాది మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ రక్తాన్ని అందించి తోటివారి ప్రాణాలను కాపాడాలన్నారు. ముఖ్యంగా తమ కళాశాల విద్యార్ధులు ప్రతి ఏటా వందలాది యూనిట్లు రక్తదానం చేసి సేవలందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్స్‌ ఎం. వెంకటేశ్వరరావు, పీఎల్‌ రమేష్‌, ఐక్యూఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ జీ. కష్ణవేణి, జువాలజీ విభాగాధిపతి ఎం. సాహితీ, బోటనీ విభాగాధిపతి ఎస్‌కే అలీబాషా, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్లు వీ శేషగిరిరావు, డీ పవన్‌కుమార్‌, ఎన్‌ సాంబశివరావు, అధ్యాపకులు డాక్టర్‌ శకుంతల పాల్గొన్నారు.

➡️