4న బంద్‌ జయప్రదం చేయాలి : ఎ స్‌ఎఫ్‌ఐ

Jul 1,2024 22:54

ప్రజాశక్తి – తిరువూరు : ఈ నెల 4న జరగనున్న దేశ వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి చెరుకు మోహన్‌ కృష్ణ, నరసింహారావు విద్యాసంస్థలకు విజ్ఞప్తి చేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టిఏ) జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. నీట్‌ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు నిర్వహిచంచి దోషులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం బంద్‌ నోటీసులు అందజేశామని మోహన్‌ కృష్ణ, నరసింహారావు తెలిపారు. కంచికచర్ల : నీట్‌ నెట్‌ పరీక్షల లీకేజ్‌ పై సమగ్ర విచారణ జరపాలని అసమర్ధత (ఎన్‌టిఎ)ను రద్దు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా ఎల్‌ కేజీల నుండి పీజీ వరకు విద్యాసంస్థలు బంద్‌ ను జయప్రధం చేయాలని ఎఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్షుడు గోపి నాయక్‌ పిలుపునిచ్చారు. స్థానిక శ్రీఅక్షర కళాశాలలో విద్యార్థులతో కలిసి ఎఎస్‌ఎఫ్‌ఐ బంద్‌ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపినాయక్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్‌ నెట్‌ లీకేజీలో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా నాయకురాలు, జాహిదా, కంచికచర్ల మండల నాయకులు మాధవ్‌, గోపి, ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️