పలుపార్టీల అభ్యర్థుల ప్రచారాలు

Apr 18,2024 22:32
  • కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య

ప్రజాశక్తి – నందిగామ : టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య గురువారం నందిగామ పట్టణం రెండవ వార్డులో కూటమి ఉమ్మడి నేతలతో కలసి సూపర్‌సిక్స్‌ పథకాలపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి అందరినీ కలసి ఆప్యాయంగా పలకరిస్తూ నందిగామ నియోజకవర్గ అభివద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఓట్లను అభ్యర్థించారు.

  • వైసిపి అభ్యర్థి జగన్‌ మోహన్‌ రావు

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ పట్టణంలో రైతు పేట, డివిఆర్‌ కాలనీ ఏరియాలో వైసిపి శ్రేణులతో కలిసి ప్రతి గడపకు తిరుగుతూ, ఎన్నికల ప్రచారంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పాలనలోఎమ్మెల్యేగా నా ఐదేళ్ల పదవీకాలంలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశా, ముఖ్యంగా గత నందిగామను – ప్రస్తుత నందిగామను పోల్చుకుంటే ఎంత అభివద్ధి జరిగిందో స్పష్టంగా కనబడుతుందన్నారు. మంచి చేశానని పూర్తిగా నమ్మితేనే ఆశీర్వదించాలని కోరారు.

  • టిడిపి అభ్యర్థికొలకపూడి ప్రచారం

ప్రజాశక్తి – విస్సన్నపేట : మండలం స్థానిక సత్తుపల్లి రోడ్‌లో గడపగడపకు తిరుగుతూ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి కొలికపూడి శ్రీ నివాస్‌ ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు.

➡️