చల్లబడిన వాతావరణం

May 7,2024 21:50
  • పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
  • కొన్నిచోట్ల పిడుగు ప్రభావాలు

మండల పరిధిలోనే పలు గ్రామాల్లో మంగళవారం ఉరుములతో ఈదురుగాలులు వ్యాపించి భారీ వృక్షాలు నేలకొరిగాయి. జుజ్జూరు గ్రామంలో ఉరుములతో పాటు ఈదురుగాళ్లు ఉండటంతో పలు పేదల ఇల్లు రేకులు గాలికి ఎగిరి పడిపోయాయి. పిడుగు పడటంతో ఇదే గ్రామానికి చెందిన షేక్‌ అనీఫా జానీ ఇంటి భవనంపై స్లాబ్‌ చెక్కలు ఊడిపడి ఉండటంతో ఆ కుటుంబం ఒక్కసారి ఉలిక్కిపడి ఆందోళన గురయ్యింది. మండలంలో పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారి చల్లబడింది. వేసవికాలంలో ఒక్క పూత ఎర్రటి ఎండలు ఒక్కసారిగా వాతావరణ వచ్చిన మార్పుగా చల్లని గాలి వీచడంతో వృద్ధులు పిల్లలు ఉల్లాసంగా వర్షాన్ని ఆస్వాదించారు. ఈ భారీగా ఈదురుగాలి రావడంతో అల్లూరు చౌటుపల్లి చట్టనవరం రోడ్ల రాకపోకల కాంతారావు ఏర్పడింది.రెడ్డిగూడెంలో ఈదురు గాలులతో వర్షం రెడ్డిగూడెం : మంగళవారం సాయంత్రం రెడ్డిగూడెం మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులు, వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. ఎండి వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు ఈ వానరాకతో చల్లగా సేదదీరారు. సేద తీరిన ప్రజలు మైలవరం : నిన్న మొన్నటివరకు విపరీతమైన ఎండలు, వడగాలులతో అల్లాడిన ప్రజలు మంగళవారం చిరుజల్లులు పడటంతో సేద తీరారు. ఉదయం నుండి ఎండలతో పాటు ఉక్కపోతతో పాటు వేడి గాలులు వీచడంతో ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆకాశం ఒకసారిగా మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. చిరుజల్లులు పడటంతో వాతావరణం చల్లబడింది. దీంతో స్థానిక ప్రజలు ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందారు.వేసవి తాపానికి కాస్త ఉపశమనంకంచికచర్ల : గడచిన కొద్దిరోజులుగా ఎండ తీవ్రతకు ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు కాస్త ఉపశమనం పొందారు. వంద సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండ తీవ్రత పెరిగింది. రెండు రోజుల క్రితం పగటిపూట ఎండ తీవ్రత 47 డిగ్రీలు దాటింది. దీంతో జనం అల్లాడిపోయారు. ఈ క్రమంలో మంగళవారం కంచికచర్లలో ఉదయం నుండి మొబ్బు తెప్పలు అడ్డపడటంతో కొద్దిగా ఎండ తీవ్రత తగ్గింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదరు గాలులు వేశాయి. ఈదురు గాలులకు వీధులన్నీ చెత్తా చెదారం, దుమ్ము ధూళి లేచింది. కొద్దిసేపటికి వాతావరణం చల్లబడి, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రత, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరైన జనం కాస్త ఉపశమనం పొందారు. మరో రెండు రోజులు వాతావరణంలో మార్పుల వలన అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోహిణి కార్తెకు ముందే చిరుజల్లులు కురిస్తే రోహిణి కార్తెలో వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.విద్యుత్‌కు ఐదు గంటల పాటు అంతరాయం తిరువూరు : మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంట సమ యంలో హఠాత్తుగా వాతావరణంలో సంభవించిన మార్పుతో తిరువూరు, ఏ కొండూరు మండలల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నెలరోజుల నుండి ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. సుమారు రెండు గంటల పాటు ఈదురు గాలులు, భీకరమైన ఉరుముల ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడా నికి భయపడ్డారు. కొన్ని గ్రామాల్లో ఒనిగళ్ళ వాన కూడా కురిసింది. పాత తిరువూరు బోయ బజారులో గోధుమ బ్రహ్మయ్య ఇంటి డాబాపై పిడుగు పడటంతో మెట్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుగాలి కాలనీలో షేక్‌ గపార్‌ ఇంటిపై పడిన పిడుగుపాటుకు కరెంటు వైర్‌ కాలిపోవటం, ఫ్రిజ్‌లు, ఏసీ కాలిపోయాయి. 33 కెవి విద్యుత్‌ లైన్‌పై అక్కడక్కడ పిడుగు ప్రభావం పడటంతో రెండు గంటలు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి రాత్రి 7 గంటల వరకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది.కాలుష్యంతో తల్లడిల్లుతున్న కొండపల్లి ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలో చల్లని గాలులతో ఒక మోస్తరు జల్లులు కురవడంతో స్థానిక ప్రజలు చల్లదనంతో సేద తీరుతున్నారు. మరోపక్క వేసిన గాలులతో విటిపిఎస్‌ నుంచి విడుదలైన బూడిదతో కొండపల్లి ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. కొండపల్లి కొండలు సైతం బూడిద వర్షంలో మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు బూడిద వర్షం కురుస్తున్నప్పటికీ మంగళవారం వీచిన గాలులతో భారీ ఎత్తున బూడిద ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాలను చుట్టివేసింది.

➡️