మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ధర్నా

Jan 26,2024 15:09 #ntr district
cpm protest on water problems

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : పాత రాజీవ్ నగర్ కొత్త రాజీవ్ నగర్ ప్రకాష్ నగరాలలో 15 రోజులుగా మంచినీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ 15 రోజులుగా మంచినీళ్లు రాకపోతే ప్రజలు ఎలా జీవిస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి మంచినీటి సమస్య పట్టదని నీళ్ళకు బదులు మందు ఎక్కడపడితే అక్కడ దొరుకుతుందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు కార్పొరేటర్లుకు ప్రజా సమస్యలు పట్టవా అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. పేదలకు కనీసం మంచినీళ్లు లేకపోతే కనీసం బోరు వాటర్ అయినా సప్లై చేయాలని స్కూళ్లకు ఉద్యోగాలకు వెళ్లడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు సొంత డబ్బులతో వాటర్ ట్యాంకు తెప్పించుకున్నారని ఇప్పుడే ఇలాగా ఉంటే వచ్చే వేసవికాలంలో మంచినీటి సమస్య తీవ్రమవుతుందని వైసిపి ప్రభుత్వం డౌన్ డౌన్ అని ధర్నాలో నినాదం చేసినారు. మంచినీటి సమస్య ఇక్కడ మాత్రమే కాదని త్వరలో సిటీ మొత్తం వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను తీవ్రం కాకుండా చూడాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున నగరంలో ధర్నాలు నిర్వహిస్తామని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమానికి స్పందించిన డిఈ సింధూర మాట్లాడుతూ మంచినీటి సమస్య త్వరలోనే పూర్తి అవుతుందని ప్రజలలో ఆందోళన చేస్తున్న ప్రజలు మంచినీటి సమస్యపై ఆమెకి తెలియజేయగా త్వరలో మంచినీటి సమస్య తీరిపోతుందని మాట్లాడుతుండగా స్థానికులు ఉదయం వచ్చిన మంచినీళ్లు తీసుకొచ్చి చూపించారు. ఆ వాటర్ నల్లగా ఉండటంతో ఆవాక్కైనారు వెంటనే స్పందించిన డి ఈ సింధూర వెంటనే వాటర్ ట్యాంకులు తెప్పించాలని క్రింద స్థాయి అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ధర్నాలో జరుగుతున్న పరిస్థితిని మంచినీటి సమస్యను చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావుతో సిహెచ్ బాబురావు మంచినీటి సమస్యపై ఆయనకు తెలియజేశారు. స్పందించిన ఆయన త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ ఏరియా ఇన్స్పెక్టర్ తాతారావు సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణ రావు, సెంట్రల్ సిటీ ప్రెసిడెంట్ కే దుర్గారావు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి, సిఐటియు నాయకులు సిహెచ్ శ్రీనివాస్, డివిజన్ నాయకులు బొంగు రాంబాబు, అమ్ములు, ఝాన్సీ, పి సాంబిరెడ్డి, కే సూరిబాబు ఎర్రన్న నాగబ్రహ్మం హనుమంతరావు, షేక్ పీరు మహిళలు ప్రజలు పాల్గొన్నారు.

➡️