తడి పొడి చెత్త తరలించే వాహన డ్రైవర్ల ధర్నా

May 18,2024 19:20
  • ప్రతి నెల సమయానికి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ –
  • 18 ,500కు జీతం పెంచాలని డిమాండ్‌

ప్రజాశక్తి – అజిత్‌ సింగ్‌నగర్‌ : తడి పొడి చెత్తను తరలించే డ్రైవర్ల వాహనదారులు తమ జీతాలు పెంచాలని శనివారం ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. సింగ్‌నగర్‌ వాంబే కాలనీ డంపింగ్‌ యార్డ్‌ దగ్గర క్యాబ్‌ వాహనదారుల డ్రైవర్లు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నాయకులు ప్రవీణ్‌ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ అధికారులు డ్రైవర్లకు జీతాలు పెంచుతామని మాట ఇచ్చారని కానీ ఇప్పటివరకు ఎలాంటి జీతాలు పెంచకపోగా ఇస్తున్న జీతాలు కూడా ఇవ్వటం లేదని కుటుంబాలు నడవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని కరెంటు బిల్లు ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నామని జీతాలు రాకపోతే తాము ఎలా బ్రతకాలా అని ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వెంటనే ఇవ్వాలని వాహనాలు రిపేర్లు విపరీతంగా వస్తున్నాయని వాటి ఖర్చు డ్రైవర్లు భరించాలని చెప్పటం దారుణని అన్నారు. ఇంటి అద్దె కట్టడానికే డబ్బులు లేకపోతే వాహన రిపేర్లు ఎలా చేయాలని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన మాట ప్రకారం 18,500 వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఇఎస్‌ఐ పిఎఫ్‌ తదితర పథకాలు వెంటనే వచ్చేలా ప్రభుత్వం కల్పించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే నగరం మొత్తం సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్యాబ్‌ డ్రైవర్లు, సిఐటియు నాయకులు నగర కోశాధికారి డి.స్టీఫెన్‌ బాబు, నగర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి టి.ప్రవీణ్‌, డ్రైవర్లు కిరణ్‌, శివ, రవి, నజీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️