ముగిసిన ప్రచారాలు

May 11,2024 21:35

శనివారంతో ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రోడ్‌ షోలు, ర్యాలీలు, బైక్‌ ర్యాలీలతో వారి వారి ప్రచారాలను ముగించారు. అభ్యర్థుల కుటుంబాలు సైతం ప్రచారాల్లో పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. మైలవరంలో వైపిపి అభ్యర్థులు రోడ్‌షోప్రజాశక్తి – మైలవరం : వైసిపి విజయవాడ ఎంపి అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌, మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు శనివారం మండలంలోని వెల్వడం, మైలవరంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించిన సిఎం జగన్‌ మరొకసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.వైసిపి అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ ప్రచారంప్రజాశక్తి విస్సన్నపేట : తిరువూరు నియోజకవర్గ వైసిపి ఎంఎల్‌ఏ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ ఎన్నికల ప్రచారం అనుకున్న సమయానికి ముందే విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామంలో ముగిసింది. అరవై అయిదు రోజులు నిర్విరామంగా గంపలగూడెం మండలం ఉమ్మడి దేవరపల్లిలో ప్రారంభమై గ్రామ గ్రామాన పల్లె పల్లెల వెంట పట్టణాలను పంచాయతీలను చుట్టుముడుతూ ఎండనక వాననక రేయనకా పగలనక అలసట లేకుండా 43 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని వేమిరెడ్డిపల్లి గ్రామంలో ముగించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు తదితరులకు స్వామి దాస్‌ ధన్యవాదాలు తెలిపారు.ఉదయభాను కుటుంబీకుల ప్రచారంజగ్గయ్యపేట: జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన సామినేని ఉదయభానుని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక అన్నారు. మండలంలోని ముక్త్యాల, అగ్రహారం గ్రామాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రభుత్వ విప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను చేసిన అభివృద్ధిని తెలియపరుస్తూ ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక, కోడలు కావ్య, మేనకోడలు ప్రజ్ఞ, ఇంటూరి శ్రీలత శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్తూ మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా సామినేని ఉదయభానుని మరొకసారి గెలిపించాలని ప్రజలను కోరారు.ప్రభుత్వ విప్‌ ఉదయభాను విజయానికి ప్రచారంజగ్గయ్యపేట : పట్టణంలోని శుక్రవారం రాత్రి మార్కండేయ బజారులో వైసిపి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ పద్మశాలి సంఘం నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా చేనేత విభాగం వైసిపి అధ్యక్షులు పెంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పద్మశాలీలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండాలని, పద్మశాలీలు ఎక్కువమంది బంగారం పని చేస్తుండటంతో వారి అభ్యున్నతికి కూడా పాటుపడేలా రాబోయే వైసిపి ప్రభుత్వంలో మనం మన హక్కులను పరిరక్షించుకోవాలని మన ఆశయాలను నెరవేర్చుకోవాలని ఫ్యాను గుర్తుకే మన అమూల్యమైన ఓట్లు వేసి పార్లమెంటు శాసనసభ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు.ఉదయభాను ప్రచారంజగ్గయ్యపేట : ఎన్నికల సందర్భంగా చంద్రబాబు బూటకపు మేనిఫెస్టోను ప్రపంచ బ్యాంకుల సైతం అమలు చేయలేదని ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. మండలంలోని చిల్లకల్లు గ్రామంలో ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. 2014లో 100 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. కానీ జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తూ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేశారని అన్నారు. మరొకసారి ఎన్నికల్లో చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పథకాలు అంటూ ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నాడని దానిని ప్రజలు నమ్మొద్దని కోరారు. 2019 నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని గతం కంటే ఎక్కువ అభివృద్ధి చేశానని చెప్పారు. 14 కోట్ల రూపాయలతో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. హైవే పై కోటి రూపాయలతో బస్టాండ్‌, టిటిడి కళ్యాణ మండపం నిర్మాణం, షాదిఖానా నిర్మాణాలు చేసినట్లు గుర్తు చేశారు.కంచికచర్లలో టిడిపి అభ్యరి సౌమ్య రోడ్‌ షోప్రజాశక్తి – కంచికచర్ల : నందిగామ టిడిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం రోడ్‌ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచర ఘట్టం ముగింపు దశకు రావటంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ రోడ్‌ షో నిర్వహించారు. స్థానిక. టిడిపి కార్యాలయం నుండి గొట్టుముక్కల రోడ్పె, నెహ్రూ సెంటర్‌, జాతీయరహదారి, చెవిటికల్లు, బంక్‌ సెంటర్‌ అంబేద్కర్‌ కాలనీ వరకు డ్‌ షో నిర్వహించారు. యువకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రోడ్‌ షో సందర్భంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోగంటి బాబు, వేమా కిషోర్‌, అనుమోలు వాసు, బుల్లిబాబు, వేమా వెంకట్రావు, అల్లడి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తంగిరాల సౌమ్య మండలంలోని మోగులూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోగులూరు గ్రామానికి చెందిన పలువురు వైసిపిని వీడి తంగిరాల సౌమ్య సమక్షంలో టిడిపిలోకి చేరారు.టిడిపి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ ప్రచారంప్రజాశక్తి – వత్సవాయి : జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా వత్సవాయి మండలం చిట్యాల, సింగవరం గ్రామాల్లో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిట్యాల, సింగవరం గ్రామాల్లో ఇంటింటా సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా కేశినేని శివనాథ్‌ చిన్నిని గెలిపించాలని కోరారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరి జీవితాల్లో మార్పు రాలేదని అందరూ తీవ్రంగా దెబ్బతిన్నారని, ఊరు వాడ ఏకమై మే 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి వైసిపిని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.ప్రచారంలో కొలికపూడి శ్రీనివాస్‌ప్రజాశక్తి – విస్సన్నపేట : విసన్నపేట మండలంలో చివర రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కొండపర్వ , చండ్రుపట్ల తెల్లదేవరపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోజుతో మండలంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.కూటమి ప్రచారంలో వంగవీటి రాధాప్రజాశక్తి – నందిగామ : బటన్‌ నొక్కి నొక్కి అలిసిపోయిన సిఎం జగన్మోహన్‌రెడ్డికి ఇక సెలవు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు టిడిపి నాయకుడు వంగవీటి రాధా పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో శనివారం వంగవీటి రాధ పర్యటించారు. నందిగామ నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్డీయే కూటమి నేతలతో కలిసి వంగవీటి రాధా నందిగామ పట్టణంలో రైతుపేట పార్టీ కార్యాలయం నుండి రైతుపేట, సిఎం రోడ్డు, గాంధీ సెంటర్‌, పాత బస్టాండ్‌ మీదుగా అనాసాగరం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రజలను కులాలు, మతాలవారీగా విడ గొట్టిందని ఆరోపించారు. కాపులందరూ కలిసికట్టుగా ఉన్నామని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుందన్నారు. నందిగామ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను గెలిపించాలని కోరారు. ఇప్పటికే కూటమి అభ్యర్థుల విజయం పక్కా అన్నారు. చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమన్నారు.

➡️