అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

Apr 18,2024 22:29

పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గురువారం నామినేషన్‌ వేశారు. చిట్టినగర్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక న్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా, చెన్ను పాటి శ్రీనివాస్‌, ఎమ్మెస్‌ బేగ్‌, ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షు లు అడ్డూరి శ్రీరామ్‌, జన సైనికులు అమ్మిశెట్టి వాసు, రజిని కూటమి అభ్యర్థి సుజనాకు ఘన స్వాగతం పలికారు. మైలవరం : మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్‌ వేశారు. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ 82 కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి ఇబ్రహీం పట్నానికి చెందిన వల్లభనేని నాగ పవన్‌ కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ అందజేశారు. గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఒకరు మాత్రమే మైలవరం నియోజకవర్గం సంబంధించి ముందుగా నామినేషన్‌ వేశారు. జగ్గయ్యపేట: జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గానికి మొదటిరోజు శుక్రవారం 5 నామినేషన్‌లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అర్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. టిడిపి తరఫున శ్రీరాం శ్రీదేవి, బహుజన సమాజ్‌ వాది పార్టీ తరఫున కొదమల ప్రభుదాస్‌, టిడిపి శ్రీరామ్‌ రాజగోపాల్‌ తరుపున మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, అంబేద్కర్‌ నవరంగ్‌ కాంగ్రెస్‌ తరపున చింతమల నవీన్‌, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ తరపున గుడిసె రాంబాబు తమ నామినేషన్‌లు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. నామినేషన్‌ ప్రారంభం అవ్వడంతో నందిగామ ఎసిపి డాక్టర్‌ రవి కిరణ్‌ పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయానికి విచ్చేసి ఎన్నికల సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. తిరువూరు : తిరువూరు నియోజవర్గ వైౖసిపి అభ్యర్థిగా నల్లగట్ల స్వామి దాస్‌ గురువారం దాఖలు చేశారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. బైపాస్‌ రోడ్డు అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో గల వైసీపీ ఎన్నికల కార్యాలయం నుండి మెయిన్‌ రోడ్డు మీదగా కోకిలంపాడు రోడ్డులోని ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులుగా గౌతం రెడ్డి వైసీపీ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారా యణరెడ్డి, కలకొండ రవికుమార్‌, శీలం నాగనర్సిరెడ్డి, కాలసాని చెన్నారావు, నాగేశ్వరరావు, భూక్యగనియా, చలమాల సత్యనారాయణ, మాజీ జడ్పీ చైర్పర్సన్‌ సుధారాణి, యాదవ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కాల సాని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఆంక్షలతో ఇబ్బందులుఅయితే నామినేషన్‌ ప్రక్రియకు పోలీసులు ఆంక్షలు విధించడంతో నాయకులు కార్యకర్తలతో పాటు మీడియా బృందం కూడా ఇబ్బందులు పడ్డారు. ఆర్డీవో కార్యాలయానికి 100 అడుగుల దూరంలో కోకిలంపాడు రోడ్డులోనే వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్డీవో కార్యాలయంలో మీడియా కౌంటర్‌ కూడా ఏర్పాటు చేయలేదు. అధికారులు నిబంధన సడలించాలని, కనీసం మీడియానైనా ఆర్డీవో కార్యాలయం లోపలికి వెళ్లే అవకాశం కల్పించాలని పలువురు నాయకులు కోరుతున్నారు. నందిగామ : రిటర్నింగ్‌ అధికారి (83 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం నందిగామ) రెవెన్యూ డివిజన్‌ అధికారి నందిగామ కార్యాలయంలో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి నందిగామ ఏ రవీంద్రరావు గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రెండు నామినేషన్లు స్వీకరించారు. ఈ నామినేషన్‌ ప్రక్రియలో మూడు నామినేషన్లు స్వీకరించి ఉన్నారు. బర్రె శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వరరావు (జై భీమ్‌ శ్రీనివాస్‌) తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ వారు రెండు నామినేషన్‌లు దాఖలు చేశారు. కొత్తపల్లి సుందర్‌రావు తండ్రి కోటయ్య, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

➡️