కూటమి గెలుపునకు సినీ నటులు నారా రోహిత్‌, రఘు ప్రచారం

May 6,2024 22:00

ప్రజాశక్తి- నందిగామ : గడచిన ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపి, సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని ప్రముఖ సినీ నటులు నారా రోహిత్‌, రఘు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నందిగామ నియోజకవర్గం చందర్లపాడులో బిజెపి, జనసేన పార్టీలు బలపరిచిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, కేశినేని వెంకట్‌తో కలిసి వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సినీ నటులు ఎన్నికల ప్రచారంలో రావడంతో కార్యకర్తలు నాయకుల్లో నూతన ఉత్తేజం కలిగింది. ప్రచార రథంపై అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు.

➡️