టీమ్‌కు ఆర్థిక సాయం, క్రికెట్‌ కిట్లు పంపిణీ

May 21,2024 20:28
  • క్రీడా స్ఫూర్తిని చాటుకున్న కార్పొరేటర్‌ హర్షద్‌

ప్రజాశక్తి, వన్‌టౌన్‌ : యువత క్రీడారంగంలో రాణించి దేశానికి మంచి పేరు తేవాలని 54వ డివిజన్‌ కార్పొరేటర్‌ అబ్ధుల్‌ హర్షాద్‌ అన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో షణ్ముఖ సహారా క్రికెట్‌ టీంకు 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, క్రికెట్‌ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా హర్షద్‌ మాట్లాడుతూ క్రికెట్లో భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని అన్నారు. యువతి యువకులు ఎక్కువగా క్రికెట్‌ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. మన దేశం నుంచి అత్యుత్తమ క్రీడాకారులు క్రికెట్లో రాణిస్తున్నారని ఆయన అన్నారు. క్రీడా రంగానికి సంబంధించి క్రికెట్‌ ఆటలో యువతను ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రికెట్‌ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️