ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేత

Jul 1,2024 22:56

కలెక్టర్‌ సజన..మైలవరం, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాల పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జక్కంపూడి కాలనీ, ఫకీర్‌ గూడెం, గిరిపురం ప్రాంతాల్లో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్‌ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెంచిన పెన్షన్‌ మొత్తాన్ని సరైన విధంగా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు సృజన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం : విజయవాడ రూరల్‌ మండలంలోని జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం కాలనీలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజనతో కలసి, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు పింఛన్‌ పంపిణీ చేశారు. ముందుగా కలెక్టర్‌ సజన గారిని ఘనంగా స్వాగతించి, శాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. భవానీపురం : 42వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో ప్రియదర్శిని కాలనీలో పర్యటనలో భాగంగా శాసనసభ్యులు సుజనా చౌదరి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌లను లబ్ధిదారులకు అందజేశారు. వియవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి శ్రీనివాసరావు కలిసి 52వ డివిజన్‌ సచివాలయం నెంబర్‌ : 114 మల్లికార్జున పాట నాలుగు పంపులు సెంటర్‌ వద్ద తల్లి లాంటి వృద్ధురాలిని పూలమాలతో సత్కరించి పాలతో కాళ్ళను కడిగి రూ. 7 వేలు పెన్షన్‌ అందజేశారు. వన్‌టౌన్‌ : 50వ డివిజన్లో సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌, స్థానిక కార్పొరేటర్‌ బోయి సత్యబాబు వద్ధులు, వితంతు, వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఎన్టీఆర్‌ పెన్షన్‌ భరోసా పెన్షన్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రెటరీ, వీఆర్వోలు, డివిజన్‌ సిపిఎం నాయకులు పి రాజు, సిహెచ్‌ దుర్గా రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విసన్నపేట : తాతకుంట్లలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించి టెన్షన్‌ పంపిణీ ప్రారంభించారు. కంచికచర్ల : కంచికచర్ల అంబేద్కర్‌ నగర్‌ అరుంధతి కాలనీల్లో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పెన్షన్‌ పంపిణీ చేశారు. పెనుగంచిప్రోలు : స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌, అధికారులు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు పంపిణీ చేశారు. వత్సవాయి : చిట్యాల గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు, కన్నివేడు తెలుగు యువత నాయకులు కర్నాటి రఘు మండలంలో పింఛన్లు పంపిణీ చేశారు. గంపలగూడెం : నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం పెంచిన పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేసినట్లు మండల టిడిపి అధ్యక్షులు రేఖ, వీరారెడ్డి తెలిపారు. మండల పరిధిలో పలుచోట్ల పర్యటించి, పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్‌ కోట పుల్లమ్మ, పట్టణ అధ్యక్షులు కాజా రవికుమార్‌, పెన్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ అధికారి జి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డిగూడెం : మండలంలో పెంచిన పింఛన్లు లబ్ధిదారులందరికీ అందజేశారు. తిరువూరు తిరువూరు 9వ వార్డులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పింఛన్‌ పంపిణీ ప్రారంభించారు. వీరులపాడు : జుజ్జూరులో నందిగామ ఎంఎల్‌ఎ సౌమ్య ఎన్టీఆర్‌ భరోసా కింద పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేశారు.మైలవరం : మండలంలో స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌ పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు.జగ్గయ్యపేట: మండలంలో స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌(తాతయ్య) పంపిణీ చేశారు.

➡️